ఆన్‌లైన్‌లో `డైనోసార్` ఫ‌ర్ సేల్‌

Saturday, June 2nd, 2018, 10:46:08 AM IST

హాలీవుడ్‌లో జ‌నాద‌ర‌ణ పొందిన గ్రేట్ సినిమాల‌కు సంబంధించి… పోస్ట్ రిలీజ్‌ మ‌ర్కండైల్ (సినిమా రిలేటెడ్ ఉత్ప‌త్తుల అమ్మ‌కం) ఓ రేంజులో ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. బిలియ‌న్ డాల‌ర్‌ సంచ‌ల‌నాలు కేవ‌లం బాక్సాఫీస్ వ‌ద్ద మాత్ర‌మే కాదు.. ఆయా సినిమాల ఉత్ప‌త్తుల్ని ఆన్‌లైన్‌లో అమ్మ‌కాలు సాగించి రికార్డులు సృష్టిస్తుంటారు. అప్ప‌ట్లో స్పైడ‌ర్ మేన్ మాస్క్‌లు ఆన్‌లైన్‌లో అమ్మ‌కానికి పెట్టారు. దానికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

ఇప్పుడు అంత‌కుమించిన వేరొక వ‌స్తువు అమ్మ‌కానికి వ‌స్తోంది. జూన్ 22న వ‌స్తున్న `జురాసిక్ వ‌ర‌ల్డ్‌-ఫాలెన్ కింగ్‌డ‌మ్` హైప్‌ని దృష్టిలో పెట్టుకుని `క్రానిక‌ల్ క‌లెక్టిబుల్స్` పేరుతో ఆన్‌లైన్‌లో బేబి డైనోసార్ బొమ్మ‌ల్ని అమ్మేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ టాయ్ పేరు `బేబి బ్లూ`. ఆన్‌లైన్‌లో ప్రీఆర్డ‌ర్ ద్వారా బుక్ చేసుకోవ‌చ్చు. జురాసిక్ పార్క్ సిరీస్ అభిమానుల్లో పిల్ల‌లు అధికంగా ఉన్నారు. ఈ స‌మ్మ‌ర్‌లో ఎంతో క్రేజీగా రిలీజ‌వుతున్న ఫాలెన్ కింగ్‌డ‌మ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ క్ర‌మంలోనే `బేబి బ్లూ` టాయ్‌ డైనోసార్‌ అమ్మ‌కాల‌పైనా భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి.