ప్లాప్ సినిమాకు సీక్వెల్ అవసరమా .. బాసూ ?

Friday, September 21st, 2018, 12:32:25 PM IST

జనరల్ గా అయితే ఓ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ చేసి .. ఆ సినిమా క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటారు .. కానీ ఈ దర్శకుడు మాత్రం భారీ ప్లాప్ అయినా సినిమాకు సీక్వెల్ చేస్తానని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా దర్శకుడు ఏమా కథ అంటే !! ఈ మద్యే మిల్కి భామ తమన్నా కీ రోల్ లో ప్రభుదేవా హీరోగా వచ్చిన అభినేత్రి చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ త్రిభాషా చిత్రం తమిళ్ లో మాత్రం యావరేజ్ గా నిలిచింది .. కానీ హిందీ, తెలుగులో అట్టర్ ప్లాప్ అయింది. ఆ తరువాత విజయ్ దర్శకత్వంలో ప్రభుదేవా నటించిన లక్ష్మి కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు .. అయినా సరే ప్రభుదేవా – దర్శకుడు విజయ్ లు కలిసి అభినేత్రి సినిమాకు సీక్వెల్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఇందులో కూడా తమన్నా హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అభినేత్రి 2 టైటిల్ తో ఈ సినిమా రానుందట. ఒక ప్లాప్ సినిమాకు సీక్వెల్ ఎందుకు తంబీ అంటూ సోషల్ మీడియాలో జోరుగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.