అమ్మో.. ‘బాపు’గారి బొమ్మో!

Tuesday, September 23rd, 2014, 01:30:46 PM IST


ఉత్తర అమెరికా తెలుగు సంఘం తామా ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు విగ్రహాన్ని ఆయన పుట్టిన ఊరు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు డిసంబర్ 15వ తేదీ బాపు పుట్టిన రోజును పురస్కరించుకుని విగ్రహాన్ని అదేరోజు ఆవిష్కరించనున్నట్లుగా తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని పేర్కొన్నారు.

ఇక అదే సమయంలో తానా నిర్వహించే చైతన్య స్రవంతి వేడుకలలో బాపు బొమ్మల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మోహన్ వివరించారు. అలాగే బాపుతో తానాకు ఉన్న అనుబధం కూడా మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. కాగా తెలుగు కళారంగంలో చిరస్థాయిగా నిలచిపోయిన ప్రముఖ చిత్రకారుడు మరియు దర్శకుడు అయిన సత్తిరాజు లక్ష్మీనారాయణ(బాపు) మన మధ్యన లేకపోయినా ఆయన భావి తరాలకు గుర్తుండాలనే సంకల్పంతోనే విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు చేస్తున్నామని తామా వివరించింది.