బాబీకి మెగా హీరో ఆఫర్..నిజమేనా..?

Tuesday, September 26th, 2017, 07:19:19 PM IST


దర్శకుడు బాబు తొలుత రచయితగా అనేక చిత్రాలకు కథల్ని అందించారు. రవితేజ పవర్ చిత్రంతో తొలిసారి దర్శకుడిగా మారిన రవితేజ తానేంటో నిరూపించుకున్నాడు. రెండవ చిత్రంతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని పొందాడు బాబీ. కానీ సర్దార్ చిత్రం విజయం సాధించకపోవడంతో ఈ యువ దర్శకుడికి నిరాశ తప్పలేదు. అదృష్టం కలసి వచ్చి జైలవకుశ చిత్రం ద్వారా ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్న బాబీ దానిని సద్వినియోగం చేసుకున్నాడు. జైలవకుశ చిత్రాన్ని మలచిన తీరుకు టాలీవుడ్ ప్రముఖుల నుంచి బాబీ ప్రశంసలు అందుకుంటున్నాడు.

దీనితో ఈ దర్శకుడి తదుపరి చిత్రంపై ఆసక్తి పెరగడం సాధారణమైన విషయం. బాబీ తరువాతి చిత్రం రవితేజతో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. మరో వైపు అల్లు అర్జున్ నుంచి కూడా బాబీ ఆఫర్ అందుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు గుప్పు మంటున్నాయి. అల్లు అర్జున్ ఊటీలో నాపేరు సూర్య చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. జై లవ కుశ గురించి తెసులుకున్న బన్నీ బాబీని ఫోన్ లో అభినందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తిరిగి రాగానే మనం కలుద్దామని కూడా బాబీ ని కోరినట్లు తెలుస్తుంది. దీనితో వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.