నిర్మాతగా మారుతున్న పవన్ దర్శకుడు ?

Wednesday, March 28th, 2018, 10:42:40 AM IST

ఈ మధ్య కొందరు దర్శకులు నిర్మాతలుగా మారుతూ సొంతంగా సినిమాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సుకుమార్, త్రివిక్రమ్ లాంటి వారు నిర్మాతలుగా అడుగులు వేశారు. తాజాగా దర్శకుడు శ్రీను వైట్ల కూడా సొంతంగా ఓ బ్యానర్ ని మొదలు పెట్టాడు. ఇప్పుడు అదే తరహాలో పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసిన బాబీ ( కే ఎస్ రవీంద్ర ) కూడా సొంతంగా సినిమాలు తీసుకునేందుకు నిర్ణయం తీసుకుని ఓ బ్యానర్ ని మొదలు పెడుతున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ తరువాత ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశతో మంచి విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ఓ వైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగా అభిరుచి గల సినిమాలను తెరకెక్కిస్తాడట. ఇప్పటికే ఈ సినిమా గురించి కథ చర్చలు కూడా జరిగాయని తెలిసింది. అరుణ్ పవర్ అనే కొత్త దర్శకుడితో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. ఈ సినిమాకోసం ఓ యువ హీరోని సంప్రదిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుందట.