ఎన్టీఆర్ బయోపిక్ కోసం దర్శకుడు మారుతున్నాడు ?

Saturday, January 27th, 2018, 12:57:15 PM IST

మహా నటుడు ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా తెరకెక్కించేందుకు అయన తనయుడు బాలయ్య జోరుగా సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా గురించి పోస్టర్ కూడా వచ్చింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం బాలయ్య చాలా సీరియస్ గా ఉన్నాడు. ఈ సినిమాను క్రేజీగా తెరకెక్కించాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడట. ఆగస్టు నుండి సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకోసం దర్శకుడు మారె అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు తేజ స్థానంలో క్రిష్ ఎంట్రీ ఇస్తున్నట్టు టాక్ ? ఇప్పటికే బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేసి మంచి క్రేజ్ కొట్టేసిన క్రిష్ అయితేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నాడట బాలయ్య. ఈ నేపథ్యంలో క్రిష్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.