ఆ క్రేజీ దర్శకుడితో .. ఎన్టీఆర్ సినిమా కన్ఫర్మ్ ?

Saturday, November 26th, 2016, 01:20:47 AM IST

ntr
”జనతాగ్యారేజ్” తరువాత ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఏమిటి ? అనే ప్రశ్నకు ఇంకా సరైన జవాబు రాలేదు. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరిపినా కూడా ఏది ఫైనల్ కాలేదు. ఇక ‘జనతాగ్యారేజ్’ భారీ విజయాన్ని అందుకుంది కాబట్టి నెక్స్ట్ అంతకు మించి హిట్ సినిమా తీయాలనే ఉద్దేశంలో భాగంగా త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి తెగ ప్రయత్నాలు చేసాడు. ‘ఆ ఆ’ తరువాత త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ తో సినిమాకు కమిట్ అయ్యాడు, అందుకనే ఎన్టీఆర్ కు మొదట నో చెప్పాడు . కానీ ఫైనల్ గా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని తెలిసింది .. ఇప్పటికే దానికి సంబందించిన కథా చర్చలు కూడా జరుగుతున్నాయని, ముఖ్యంగా జనవరి నుండి పవన్ సినిమా మొదలవుతుంది కాబట్టి .. ఆ సినిమా పూర్తీ అయిన వెంటనే ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ అవుతుందట .. అంటే వచ్చే ఏడాది ఆగస్టు లో ఈ సినిమా పట్టాలు ఎక్కనున్నట్టు సమాచారం? ఇన్నాళ్లు ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో సినిమా చేయాలనీ అనుకున్న ఫాన్స్ కు నిజంగా ఇది గుడ్ న్యూసే కదా ఏమంటారు !!