పవన్ సినిమాపై దర్శకుడి హాట్ కామెంట్స్ !

Wednesday, October 25th, 2017, 11:47:26 PM IST

ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ పెద్ద హీరోలతో భారీ హిట్స్ తీశారు. ఆయన పేరు చెప్పగానే ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా, లక్ష్మి నరసింహ వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. పవన్, మహేష్ బాబుతోనూ సినిమా తీసిన అనుభవం పరాన్జీకి ఉంది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పరాన్జీ పవన్ కళ్యాణ్ తీన్ మార్ చిత్రంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. దీనితో పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఏ దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తీన్ మార్ చిత్రంతో తనకు రీమేక్ చిత్రాలంటేనే విరక్తి కలిగిందని అన్నారు. ఆ చిత్రం ప్లాప్ అవుతుందని ముందే తెలుసునని కానీ తీయ తప్పలేదని అన్నారు. శంకర్ దాదా ఎంబిబిఎస్, లక్ష్మి నరసింహ వంటి రీమేక్ చిత్రాలు ఆల్రెడీ చేశాను. కానీ వాటిని తెలుగు వారికీ తగ్గట్లుగా మార్చాను. తీన్ మార్ చిత్రం ఉన్నది ఉన్నట్లుగా దించేయాల్సి వచ్చిందఅని పరాన్జీ అన్నారు. ఆ టైంలో అలా చేయక తప్పలేదని అన్నారు. అన్ని తెలిసి కూడా సినిమా తీసి ఇప్పుడిలా వ్యాఖ్యానించడం ఏంటని పవన్ ఫాన్స్ డైరెక్టర్ పై ఫైర్ అవుతున్నారు.