సీన్ రివర్స్ .. సంజనపై ఆ దర్శకుడి పిర్యాదు ?

Sunday, October 21st, 2018, 02:31:13 AM IST

ప్రస్తుతం మీటూ వ్యవహారం చాటంతై .. చాపంతవుతుంది. పలువురు హీరోయిన్స్ ఈ విషయంలో తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇందులో కొన్ని నిజాలు ఉన్నప్పటికీ మరొకొందరు కావాలని పబ్లిసిటీ కోసమే ఈ మీ టూ ని వాడుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇటీవలే నానా పాటేకర్ వ్యవహారంలో తను శ్రీ దత్త చేసిన ఆరోపణలపై నానా పాటేకర్ చట్టపరంగా చర్యలు తీసుకునే పనిలో ఉన్నాడు. ఇప్పుడు అచ్చంగా అలాంటి చర్య తీసుకునేందుకు రెడీ అయ్యాడు ఆ దర్శకుడు. హీరోయిన్ సంజన 12 ఏళ్ల క్రితం జరిగిన చేదు అనుభవాన్ని బయటపెట్టి తనపై ఆరోపణలు చేసిన సంజనపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యాడు కన్నడ దర్శకుడు రవి శ్రీవాస్తవ. బుజ్జిగాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా సంజన ఆ తరువాత తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దాంతో ఇప్పుడు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి స్వర్ణకడ్గం అనే సీరియల్ లో నటిస్తుంది. ఈ మద్యే దండుపాళ్యం సినిమాలో న్యూడ్ సీన్స్ లో నటించిన సంజన అవకాశాల కోసం దిగజారిందంటూ ప్రచారం జరిగింది. మరో సారి ఇలా కావాలని మీ టూ విషయంలో ఆ దర్శకుడిపై అనవసర వ్యాఖ్యలు చేసి రచ్చ చేసింది. మరి ఆ దర్శకుడు ఎలాంటి చర్య తీసుకుంటాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments