మళ్ళీ భారీ బడ్జెట్ అవసరమా .. సామి ?

Friday, May 4th, 2018, 10:38:57 AM IST

టాలీవుడ్ లో మేకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గుణశేఖర్ సినిమాలంటే జనాలకు మంచి ఆసక్తి. అయన సినిమాల్లో కంటెంట్ తో పాటు భారీ సెట్టింగులు ఉంటాయి. తాజాగా అయన హిరణ్య కశ్యప పేరుతొ ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. రానా హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తాడట. అయితే ఈ సినిమాకోసం ఏకంగా 120 కోట్ల భారీ బడ్జెట్ అవుతుందని అంటున్నాడు. ఇప్పటికే భారీ బడ్జెట్ తో చేసిన రుద్రమదేవి సినిమా విషయంలో భారీ నష్టాల పాలయిన ఈ దర్శకుడు మరో సారి భారీ బడ్జెట్ తో సినిమా చేస్తాననడం అందరికి షాక్ ఇస్తుంది. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాను నిర్మించేందుకు నిర్మాతలు ఎవరు పెద్దగా ముందుకు రాకపోవడంతో ఆయనే స్వయంగా నిర్మిస్తానని అంటున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందట. మరి ఇంత రిక్స్ అవసరమా అని సన్నిహితులు అంటున్నా కూడా అయన మాత్రం ఖచ్చితంగా చేసి తీరతా అని అంటున్నాడు. అన్నట్టు ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదలకు ప్లాన్ చేసాడట.

Comments