ఆ హీరోయిన్ కోసం…దర్శకుడి త్యాగం ?

Tuesday, June 12th, 2018, 10:51:24 AM IST

సినిమా రంగంలో కొన్ని కొన్ని రిలేషన్స్ షాకును కలిగిస్తాయి .. మరికొన్ని సంచలనం రేపుతుంటాయి. తాజాగా ఓ కుర్ర దర్శకుడి వ్యవహారం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ కుర్ర దర్శకుడు ఇప్పటికే మూడు హిట్ సినిమాలు చేసాడు .. అందులో రెండు సినిమాల్లో సదరు హీరోయిన్ తో పనిచేసాడు. ఇక పై తన ప్రతి సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇస్తానని చెప్పాడో ఏమో కానీ తాజాగా ఓ మల్టి స్టారర్ సినిమాకు సన్నాహాలు మొదలు పెట్టిన సదరు దర్శకుడు ఆ హీరోయిన్ కావాలని పట్టుబట్టాడట ! ఇక ఆ నిర్మాత ఏమో .. ఇండస్ట్రీ లో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చి క్రేజీ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు.

ఈ సినిమాకోసం దర్శకుడి మాట విని ఆ హీరోయిన్ ని అడిగితె ఏకంగా 50 లక్షలు డిమాండ్ చేసిందట .. నీ మార్కెట్ అంత లేదు .. 20 అయితే ఓకే అని చెబితే నో అన్నదట !! దాంతో ఆ హీరోయిన్ ఉంటేగాని సినిమా చేయనని చెప్పిన దర్శకుడు ఆమెతో నేనే మాట్లాడి ఒప్పిస్తానని చెప్పి 30 లక్షలకు ఓకే చేయించాడట . అయితే ఆ నిర్మాత మాత్రం 20 మాత్రమే ఇస్తాను .. మిగతావి నీవే అడ్జెస్ట్ చేసుకో అని చెప్పాడట .. సో ఆ హీరోయిన్, దర్శకుడి విషయం పై ఇప్పటికే పలు రకాల గాసిప్స్ వస్తున్నాయి .. సో ఆ హీరోయిన్ వల్ల సదరు దర్శకుడికి పదిలక్షలు నష్టమట. మరి ఈ వ్య్వవహారం ఎలా కొలిక్కి వస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments