తమన్నా దెబ్బకు .. దర్శకుడు అవుట్ ?

Saturday, January 13th, 2018, 12:14:14 PM IST

బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా క్వీన్ సినిమాను సౌత్ లో ఏకంగా నాలుగు భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ తమన్నా నటిస్తుండగా మిస్సమ్మ ఫేమ్ దర్శకుడు నీలకంఠ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా జరుపుకున్న ఈ సినిమా మలయాళ, తెలుగు వెర్షన్ లకు నీలకంఠ దర్శకత్వం వహిస్తుండగా .. తాజాగా అయన ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి ? ఇటీవలే ఫ్రాన్స్ కూడా వెళ్లొచ్చిన ఈ సినిమా నుండి దర్శకుడు తప్పుకోవడం సంచలనం రేపుతోంది. అసలు దర్శకుడు ఎందుకు తప్పుకున్నాడంటే .. హీరోయిన్ తమన్నాకు దర్శకుడికి మధ్య విభేదాలు తలెత్తాయట .. దాంతో ఈ సినిమా చేయనని దర్శకుడు చెప్పాడట. కానీ మలయాళ వెర్షన్ కు మాత్రం తానే దర్శకత్వం వహిస్తానని చెప్పాడట .. మరి వీరిద్దరి మధ్య ఎం జరిగిందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.