కె.రాఘ‌వేంద్ర‌రావ్ పై కొత్త సందేహాలు?

Friday, March 30th, 2018, 11:02:52 PM IST


ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావ్ యాక్టివిటీస్‌పై జ‌నాల్లో సందేహం రాజుకుంది. ఆయ‌న మునుముందు ఎమ్మెల్యే అవుతాడా? భ‌క్తి సినిమా తీస్తాడా? .. అంటూ డిబేట్ న‌డుస్తోంది. ఓవైపు కె.రాఘ‌వేంద్రరావు తేదేపా త‌ర‌పున‌ ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డ‌మో లేక పెద్ద‌ల స‌భ‌కు వెళ్లేందుకు ఏదో ఒక కోణంలో దారి వెతుక్కోవ‌డ‌మో చేస్తార‌న్న ప్ర‌చారం బ‌య‌ట సాగుతోంది. ఇటీవ‌లి కాలంలో ఏపీ సీఎం చంద్ర‌బాబుతో రాఘ‌వేంద్రుడు మెయింటెయిన్ చేస్తున్న ర్యాపో కొత్త ఊహ‌ల‌కు రెక్క‌లొచ్చేలా చేస్తోంది. ఇదివ‌ర‌కూ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధ్య‌క్ష‌ప‌ద‌వి ద‌క్క‌నుంద‌న్న ప్ర‌చారం సాగింది. అయితే ఏమైందో మ‌ధ్య‌లో అది కుద‌ర‌లేదు. ఏదైతేనేం .. నేడు టాలీవుడ్ త‌ర‌పున కె.రాఘ‌వేంద్ర‌రావు చంద్ర‌బాబును క‌లిసి ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ధ‌తిస్తున్నామ‌ని చేతులు క‌లిపారు.

ఇక వేరొక యాంగిల్‌లో చూస్తే కె.రాఘ‌వేంద్ర‌రావు తొంద‌ర్లోనే విక్ట‌రీ వెంక‌టేష్‌, సునీల్ ల‌తో ఓ భ‌క్తిర‌స చిత్రం తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌న్న స‌మాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది. అన్న‌మయ్య‌, శ్రీ‌రామ‌దాసు వంటి మేటి భ‌క్తి చిత్రాల్ని అందించిన రాఘ‌వేంద్రుడి మైండ్‌లో ఏం ఉంది? అన్న‌ది ఇప్ప‌టికింకా స‌స్పెన్స్‌. ఇక‌పోతే నేటితో శ్రీ‌రామ‌దాసు చిత్రం రిలీజై సరిగ్గా 12 ఏళ్లు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ పీఆర్‌వో బి.ఎ.రాజు ట్విట్ట‌ర్‌లో శ్రీ‌రామ‌దాసు టీమ్‌కి శుభాకాంక్ష‌లు తెలిపారు.