రామ్ దర్శకుడి నెక్స్ట్ ఫోకస్ నాని పైనే ?

Sunday, October 15th, 2017, 12:47:21 PM IST

హీరో రామ్ ప్రస్తుతం మంచి జోష్ మీదున్నాడు .. ఎందుకంటే అయన తాజాగా నటిస్తున్న ఉన్నది ఒకటే జిందగీ మంచి క్రేజ్ తెచ్చుకోవడమే కాకా యునానిమస్ ట్రైలర్ కూడా అదిరిందంటున్నారు జనాలు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది కిషోర్ తిరుమల. అంతకుముందు రామ్ తో తీసిన నేను శైలజ సంచలన విజయం సాధించడంతో మళ్ళీ రామ్ నెక్స్ట్ సినిమాకూడా అవకాశం ఇచ్చాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఈ నెల 27న విడుదల అవుతుంది. ఇక ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న కిషోర్ తిరుమల నెక్స్ట్ సినిమాకు అప్పుడే కమిట్మెంట్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి ? అవును.. అయన నెన్స్ట్ సినిమా సినిమా ఎవరితో తెలుసా .. హీరో నానితో !! నాని కూడా మంచి జోష్ మైంటైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఎం సి ఏ లో నటిస్తున్న నాని మేర్లపాక గాంధీ తో కృష్ణార్జున యుద్ధం చేస్తున్నాడు … ఈ సినిమా తరువాత కిషోర్ తో నాని సినిమా చేస్తాడట. ఈ సినిమా జనవరిలో సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments