మెగాస్టార్ కోసం క్రేజీ దర్శకుడి ప్రయత్నాలు ?

Friday, May 11th, 2018, 09:30:50 AM IST

మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయాలనీ ఏ దర్శకుడు అనుకోడు చెప్పండి. పైగా సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిన మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 తో ఎంట్రీ ఇచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద దుమారం రేపి తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసాడు. అందుకే ఆయనతో సినిమాలకు పలువురు దర్శకులు సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా క్రేజీ దర్శకుడు కొరటాల శివ కూడా ఆయనతో సినిమా చేయడానికి సిద్ధం అయినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ గా మహేష్ బాబు తో అయన చేసిన భరత్ అనే నేను సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా తరువాత కొరటాల కోసం పలువురు స్టార్ హీరోలు ఎదురు చూస్తున్నారు. అయితే కొరటాల ఫోకస్ మాత్రం మెగాస్టార్ పై పడిందట. ఆయనకోసం ఓ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తయింది. సురేందర్ రెడ్డ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది. ఈ సినిమా తరువాత మెగాస్టార్ తదుపరి చిత్రం ఎవరితో అన్న ఆసక్తి ఏర్పడింది. అయితే ఇప్పటికే బోయపాటి శ్రీను క్యూ లో ఉన్నాడు. మరో వైపు బోయపాటి శ్రీను కూడా మెగాస్టార్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు .. ఈ నేపథ్యంలో కోరటాల సినిమానే ముందు సెట్స్ పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Comments