పవన్ కోసమే మంచి కథను రాస్తున్నాడట?

Tuesday, October 24th, 2017, 12:44:25 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలు తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి నటులైనా ఆయనతో ఒక సినిమా చేయాలనీ అనుకుంటారు. అంతే కాకుండా దర్శకులు కూడా ఆయన డేట్స్ ఇస్తే ఒక సినిమా చేయాలనీ చాలా అనుకుంటారు. పవన్ అగ్రదర్శకుల ఆఫర్స్ ని రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఎలాగైనా పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా తియ్యాలని దర్శకుడు క్రిష్ పట్టుదలతో ఉన్నాడట.

గమ్యం ,వేదం, కంచె సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ ఈ ఏడాది మొదట్లో గౌతమి పుత్ర శాతకర్ణి తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. గతంలో క్రిష్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాకు కమిట్ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి కాన్సెప్ట్ అనుకున్నాడట. ప్రస్తుతం మణికర్ణిక సినిమాతో బిజీగా ఉన్న ఈ దర్శకుడు ఆ సినిమా అయిపోగానే పవన్ కి కథ చెప్పి ఒప్పించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి పవన్ ఒప్పుకుంటారో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments