హోటల్ బిజినెస్ లోకి క్రేజీ దర్శకుడు ?

Thursday, September 22nd, 2016, 05:50:55 PM IST

maruthi
ఈ మధ్య సినిమా వాళ్ళు కేవలం సినిమాలు మాత్రమే చేయకుండా మరో వైపు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ బిజినెస్ రంగంలో చాలా మంది టాలీవుడ్ స్టార్స్ క్రేజ్ తెచ్చుకున్న నాగార్జున, రామ్ చరణ్ లాంటి వారు ముందున్నారు. ఇక తాజాగా కొందరు స్టార్స్ హోటల్ రంగంలోకి అడుగులు వేస్తూ అక్కడ తమ ఉనికిని చాటు కుంటున్నారు. ఇప్పటికే రెస్టారెంట్ వ్యాపారంలో నాగార్జున, శర్వానంద్, మంచు లక్ష్మి, కూచిపూడి వెంకట్ లాంటి వారు వ్యాపారాలు మొదలు పెట్టేసారు. తాజాగా వీళ్ళ లిస్ట్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నాడు క్రేజీ దర్శకుడు మారుతి ? ”భలే భలే మగాడివోయ్” సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న మారుతి లేటెస్ట్ గా వెంకటేష్ తో ”బాబు బంగారం” చిత్రాన్ని చేసాడు. ప్రస్తుతం ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న మారుతీ బంజారా హిల్స్ లో ఓ రెస్టారెంట్ ని మొదలు పెడుతున్నాడట. ఇప్పటికే దానికి సంబందించిన సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయట !! త్వరలోనే అంటే దసరా రోజున ఈ హోటల్స్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట !! త్వరలోనే దీనికి సంబందించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.