రాజమౌళి కరుణతో ‘హుద్ హుద్’ గాయం మాయం..!

Sunday, January 28th, 2018, 06:45:28 PM IST

2014 లో విశాఖని కుదిపేసిన హుద్ హుద్ తుఫానుని మరిచిపోలేం. తుఫాను కల్లోలం నుంచి వైజాగ్ నగరం త్వరగానే కోలుకుంది. ప్రభత్వం చర్యలు, సినీ రాజకీయ ప్రముఖుల విరాళాలతో విశాఖ నగరం తేరుకుంది. తుఫాను ప్రభావంతో కాశిం కోట లోని 160 ఏళ్ల చరిత్ర కలిగిన పాఠశాల పూర్తిగా దెబ్బతింది. పాఠశాలని తిరిగి నిర్మించడానికి దర్శక ధీరుడు రాజమౌళి ముందుకు వచ్చారు. రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి శోభనాద్రి మరియు ప్రశాంతి లు పాఠశాల నిర్మాణానికి విరాళాలు అందజేశారు.

నేటికి పాఠశాల భవన నిర్మాణం పూర్తయింది. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో పాఠశాల భవనాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. పాఠశాల సిబ్బంది మొత్తం రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేసారు. పాఠశాల భవనానికి రాజమౌళి ‘ జనని రాజనందిని’ అని నామకరణం చేశారు.