పవన్ కళ్యాణ్ ఫాన్స్ వాళ్లకు ముద్దు పెట్టాలంటున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ

Sunday, January 1st, 2017, 12:10:43 AM IST

rgv
ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఏం ట్వీట్ చేస్తాడో, అసలు ఎప్పుడు ఎలా ఉంటాడో దర్శకుడు రాంగోపాల్ వర్మ కే తెలీదు. కొన్ని రోజుల క్రితం చిరంజీవి 150వ సినిమాని, బాలకృష్ణ 100వ సినిమాతో పోలుస్తూ కొన్ని కామెంట్స్ కూడా చేసాడు. తాజాగా తాను తీసిన ‘వంగవీటి’ చిత్రం ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొన్న వర్మ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ప్రశ్నలు వేసాడు. ఈ ప్రశ్నలకు రాంగోపాల్ వర్మ బదులు ఇస్తూ పవన్ ఒక నిద్రపోతున్న అగ్ని పర్వతంలాంటోడు అని పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేసాడు.

ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘కాటంరాయుడు’ కు సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేశారు ఆ సినిమా బృందం. పవన్ కళ్యాణ్ పంచె కట్టుతో ఒక కుర్చీలో కూర్చున్న పోస్టర్ విడుదల అయ్యింది. ఈ ఫోటో పై వర్మ ఎవరికీ అర్ధం కాని రీతిలో ఒక ట్వీట్ పెట్టాడు. ఈ లుక్ ను వర్మ ‘ఓనర్ అఫ్ ది రౌడీయిష్ షీట్’ అని అభివర్ణించాడు.ఇంత అద్భుతంగా ఈ సినిమాకు మార్కెటింగ్ చేస్తున్న టీం కు పవన్ కళ్యాణ్ ఫాన్స్ ముద్దు పెట్టాలని ఈ ట్వీట్ లో రాంగోపాల్ వర్మ చెప్పాడు. వర్మ చేసిన ఈ ట్వీట్ తమకు అనుకూలంగా ఉందా… వెటకారంగా ఉందా… అనే కన్ఫ్యూషన్ లో పడిపోయారు పవన్ కళ్యాణ్ అభిమానులు.

  •  
  •  
  •  
  •  

Comments