‘జవాన్’ ఆనందం ఆవిరి..దర్శకుడి సంచలన వ్యాఖ్యలు..!

Sunday, December 3rd, 2017, 08:20:31 PM IST

సాయిధరమ్ తేజ్ హీరోగా జవాన్ చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడు బివిఎస్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. జవాన్ చిత్రం బావుందని అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చిన కొద్ది సేపట్లోనే తమ సంతోషం ఆవిరైందని దర్శకుడు అన్నాడు. ఈ చిత్ర పైరసీ అప్పుడే బస్సులో ప్రదర్శితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. పైరసీ వలన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ లు చాలా నష్టపోతున్నారని తెలిపాడు. బివిఎస్ రవి ఈ విషయాలని ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు.

జవాన్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. అర్ధవంతమైన చిత్రం చేశానని అందరి నుంచి ప్రశంసలు అందుకోవాలని రెండేళ్లు కష్టపడి కథ రెడీ చేశా. ఎన్నో వ్యయప్రయాసలు పడి హీరోని, నిర్మాతని ఒప్పించి ఈ చిత్రాన్ని నిర్మించాం. చిత్ర యూనిట్ లోని ప్రతిఒక్కరూ రక్తం చిందించి ఈ చిత్రం కోసం పనిచేశారు. సినిమా విడుదలయ్యాక మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి. కానీ మా సంతోషం గాలిలో పెట్టిన దీపంలా అయింది. జవాన్ విడుదలైన మాట్ని షో నుంచే పైరసీ బయటకు వచ్చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.

  •  
  •  
  •  
  •  

Comments