రోబో 2. 0 బడ్జెట్ ఎంతో తెలుసా ?

Monday, October 1st, 2018, 10:28:17 AM IST

రోబో 2. 0 ప్రస్తుతం ఇండియన్ సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న చిత్రం. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా 2010లో వచ్చిన రోబో చిత్రానికి సీక్వెల్. తెలుగు, తమిళ, హిందీ, అంటూ చాలా భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా బడ్జెట్ పై రకరకాల ప్రచారం జరుగుతుంది. నిజానికి 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను మొదలు పెట్టారు .. అయితే అది ఇప్పుడు 600 కోట్ల వరకు దాటిందని న్యూస్ వైరల్ అవుతుంది. అసలు ఏ ధైర్యంతో ఈ రేంజ్ లో బడ్జెట్ పెట్టారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా రేంజ్ బాక్స్ ఆఫీస్ వసూళ్లు 600 కోట్లు మాత్రమే .. మరి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే అది ఏ రేంజ్ వసూళ్లు అందుకోవాలి. అది సాధ్యమా అన్న టాక్ వినిపిస్తుంది. ఈ విషయయలన్ని పక్కన పెడితే 2. 0 బడ్జెట్ విషయంలో దర్శకుడు శంకర్ క్లైరిటి ఇచ్చాడు. ఈ సినిమా బడ్జెట్ 70 మిలియన్స్ అని తెలిపాడు ..అంటే ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే దాదాపు 540 కోట్లు ? ఇంత బడ్జెట్ గ్రాఫిక్ విషయంలోనే ఎక్కువైందని .. ఈ సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదే లేదని తెలిపారు. ఇంత బడ్జెట్ పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదని .. లైకా ప్రొడక్షన్ నిర్మాత ప్యాషన్ తో సినిమా తీసాడని అన్నారు. ఇలాంటి నిర్మాత దొరకడం తన అదృష్టమని అన్నారు. అక్షయ్ కుమార్, అమీ జాక్సన్, ఐశ్వర్య రాయ్ నటిస్తున్నారు.