భారీ సైన్స్ ఫిక్షన్ కోసం .. శంకర్ సన్నాహాలు ?

Monday, October 1st, 2018, 09:38:45 PM IST


భారీ చిత్రాల దర్శకుడు శంకర్ ఒక సినిమా చేస్తున్నాడు అంటే .. దేశవ్యాప్తంగా సినిమా అభిమానుల్లో ఆసక్తి మొదలవుతుంది. అద్భుతాలను వెండితెరపై ఆవిష్కరించే శంకర్ తెరకెక్కించిన రోబో 2. 0 సినిమా కోసం ఆత్రంగా అయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ లో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత అయన జాతీయ నటుడు కమల్ హాసన్ తో భారతీయుడు 2 ప్లాన్ చేస్తున్నాడు. దీనికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడు శంకర్. తాజాగా శంకర్ మరో భారీ సినిమాకోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు కోలీవుడ్ లో వార్తలు జోరందుకున్నాయి. భారీ సైన్ఫ్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ఇదికూడా భారీ బడ్జెట్ తోనే ఉంటుందని .. భారతీయుడు సినిమా తరువాత ఈ చిత్రాన్ని పట్టాలు ఎక్కిస్తాడట. మరి ఈ సినిమా గురించి అయితే ఎలాంటి న్యూస్ బయటికి రాలేదు .. కానీ శంకర్ మాత్రం హాలీవుడ్ రేంజ్ లో ఈ సైన్స్ ఫిక్షన్ తెరకెక్కించే అవకాశాలు ఉన్నట్టు అయన సన్నిహిత వర్గాల సమాచారం.