2.0 సినిమాతో శంకర్ 500 కోట్లు రాబట్టగలడా?

Monday, September 10th, 2018, 04:16:48 PM IST

ఇండియన్ జేమ్స్ కెమరూన్, సైంటిఫిక్ చిత్రాల దిగ్గజం దర్శకుడు “శంకర్” ఈ సారి మొత్తం భారతీయ సినిమాల్లో ఉన్న అన్ని రికార్డుల పైన కన్నేసినట్టున్నాడు. ఈ సారి మాత్రం కొడితే అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోవాలి అని అనుకుంటున్నడేమో. దర్శకుడు శంకర్, తమిళ్ తలైవా రజినీకాంత్ తో తీసిన తాజా చిత్రం 2.0 ఈ చిత్రం విడుదలకి ఇంకా చాలా సమయం ఉంది కానీ ఈ లోపు ఈ చిత్రానికి సంబందించిన టీజర్ విడుదల చేస్తాం అని ప్రకటించారు. ఈ నేపధ్యం లో రోజుకొక పోస్టర్ ని విడుదల చేస్తున్నారు.

ఈ పోస్టర్ లను చూస్తుంటే ఒక్కరికి మతులు పోతున్నాయి అనే చెప్పాలి. వారు ఆ చిత్రం కోసం ఎంత కష్టపడ్డారో ఎంత శ్రద్ధ తీస్కొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారో ఆ పోస్టర్ లని చూస్తేనే అర్ధం అవుతుంది. అసలే దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి ముందు తీసిన “స్నేహితుడు”,”ఐ” రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. ఈ సారి మాత్రం ఏది ఏమైనప్పటికి ఖచ్చితంగా హిట్ కొట్టాలనే శంకర్ నిర్ణయించుకున్నట్టు ఉన్నాడు. దానికి తోడు 2.0 చిత్రాన్ని 3D లో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇక ప్రేక్షకుల్లో ఒక్కో రోజు దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.. ఈ సారి శంకర్ ఐనా పెద్ద హిట్ అందుకోవాలి అని కోరుకుందాం. ఒక సారి మీరు కూడా ఆ పోస్టర్ ల మీద ఒక లుక్కెయ్యండి..

Director Shankar Planning Very Big For Success.

  •  
  •  
  •  
  •  

Comments