ఐదుగురు హీరోలతో భారీ మల్టి స్టారర్ !!

Sunday, November 13th, 2016, 12:25:49 AM IST

sriramaditya
ఈ మధ్య తెలుగులో మళ్ళీ మల్టిస్టారర్ సినిమాల హవా బాగానే ఉంది. ముఖ్యంగా ”సీతమ్మ వాకిట్లో… ” సినిమాతో .. ఇద్దరు స్టార్ హీరోలు ఈ మల్టి స్టారర్ సినిమాలకు తెర లేపారు. ఆ తరువాత పలు మల్టి స్టారర్ సినిమాలు రూపొందుతున్నాయి కూడా . అయితే ఇప్పుడు ఓ క్రేజీ మల్టి స్టారర్ సినిమా రానుంది. ఇందులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు హీరోలు నటిస్తారట!! అవును .. వింటేనే షాకింగ్ గా ఉందా .. ఆ వివరాల్లోకి వెళితే .. ఆ మధ్య సుధీర్ బాబు హీరోగా ”భలే” మంచిరోజు చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేసిన శ్రీరామ్ ఆదిత్య ఓ సూపర్ కథను రెడీ చేసాడని తెలిసింది. ఈ సినిమాలో ఐదుగురు హీరోలు ఉంటారని, ఇప్పటికే ఆ హీరోలకు కథలు వినిపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. ఇంతకీ ఆ హీరోలు ఎవరో తెలుసా నారా రోహిత్, నాగ శౌర్య, సందీప్ కిషన్ లకు కథ వినిపించి ఓకే చేయించాడట .. ఇక మిగిలిన ఇద్దరు హీరోలెవరో తెలియాలి .. తనకు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చిన సుధీర్ బాబు కుండా ఉండొచ్చు !! అన్నట్టు ఈ ఐదుగురు హీరోల్లో ఓకే సీనియర్ హీరోకూడా ఉంటాడట !! మరి ఆ హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఐదుగురు హీరోలతో శ్రీరామ్ .. గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు.