రానాతో మరో సినిమాకు తేజ సన్నాహాలు ?

Tuesday, April 24th, 2018, 10:06:11 AM IST

వరుస పరాజయాల టెన్షన్ నుండి తేజ కు రిలీఫ్ ఇచ్చాడు హీరో రానా. తేజ దర్శకత్వంలో రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా మంచి విజయం అందుకోవడంతో తేజకు మళ్ళీ అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం మహానటుడు అన్న నందమూరి తారకరామారావు బయోపిక్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా తరువాత తేజ మళ్ళీ రానాతో ఓ సినిమాకు కమిట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ కథను వినిపించాడని, కథ విన్న రానా కూడా ఓకే చెప్పినట్టు టాక్. ఈ సినిమాలో రానా ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపిస్తాడని టాక్. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలు ఎక్కే అవకాశం ఉందట. దాంతో పాటు వెంకటేష్ హీరోగా తేజ మరో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఎలాంటి సమాచారం అందకపోవడంతో బహుశా ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశాలు లేనట్టు కనిపిస్తున్నాయి .

  •  
  •  
  •  
  •  

Comments