‘నీ గ్యాంగ్ తో రా థియేటర్ కి చూస్కుందాం’ అంటున్న పెళ్లిచూపులు డైరెక్టర్

Thursday, April 26th, 2018, 01:29:38 PM IST

విజయ్‌దేవరకొండ, రీతూ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ‘పెళ్లిచూపులు’ మూవీ బాక్సాపీస్ వద్ద సూపర్‌ హిట్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖుల ప్రశంసలు లభించగా, నేషనల్ అవార్డు కూడా ద‌క్కింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పలు భాషలలో రీమేక్ అయ్యేందుకు కూడా రెడీ అవుతుంది. అయితే పెళ్ళి చూపులు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన తరుణ్ భాస్కర్ త్వ‌ర‌లో మ‌రో మూవీతో ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ న‌గ‌రానికి ఏమైంది అనే టైటిల్‌తో చిత్రం తెర‌కెక్కుతుంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌పై సురేష్ బాబు చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రీసెంట్‌గా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన టీం ఇందులో న‌లుగురు కుర్రాళ్ళ‌ని టాప్ యాంగిల్ నుండి చూపించారు. నీ గ్యాంగ్‌తో రా థియేట‌ర్‌కి, చూస్కుందాం అనే క్యాప్ష‌న్ కూడా పోస్ట‌ర్‌లో క‌నిపిస్తుంది. సినిమా తీయాల‌నే త‌ప‌న‌తో న‌లుగురు కుర్రాళ్ళు ప‌డే వేద‌న‌ని సినిమా ద్వారా ద‌ర్శ‌కుడు చూపించ‌బోతున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా అర్ధ‌మ‌వుతుంది. త్వ‌ర‌లోనే చిత్రానికి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments