మళ్ళీ మహేష్ ను కెలుకుతున్న టాప్ డైరెక్టర్

Thursday, January 26th, 2017, 09:58:12 AM IST

RGV
డేరింగ్ దర్శకుడు మళ్ళీ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ సారి తెలుగు స్టార్ హీరోలు మహేష్ మరియు పవన్ కళ్యాణ్ లపై కొన్ని ఆసక్తికర ట్వీట్లు చేశారు. పవన్ కళ్యాణ్ ను పొగుడుతూ, మహేష్ ను విమర్శిస్తూ ఆయన ఈ ట్వీట్లు చేశారు. పవన్ కళ్యాణ్ అందరి సినిమా హీరోల్లా కాదని, అందరు హీరోలు సినిమాలలోని పోలీసులు, రాజకీయ నాయకులతో పోరాటాలు చేస్తారని, కానీ పవన్ కళ్యాణ్ ఒక్కడే నిజ జీవితంలో విలన్లయిన పోలీసులు, రాజకీయ నాయకులతో పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. గొప్ప హీరోలైన బ్రూస్లీ, ఆర్నాల్డ్, సిల్వస్టర్ స్టాలోన్ వంటి వారు కూడా సాధారణ పోరాటాలు మాత్రమే చేసారని, పవన్ కళ్యాణ్ ఒక్కడే ప్రభుత్వాలతో పోరాడుతున్నారని వర్మ ట్వీట్ చేశారు.

అదే టైములో సూపర్ స్టార్ మహేష్ ఫై కూడా వర్మ ట్వీట్ చేశారు. మహేష్ బాబు తమిళుల జల్లికట్టు కు మద్దతు తెలిపారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక హోదా విషయంలో స్పందించలేదన్నారు. ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ పట్టించుకున్నంత మహేష్ పట్టించుకోలేదని అదే వారిద్దరికీ తేడా అని వర్మ ట్వీట్ చేశారు. మహేష్ కు తమిళులపై ఉన్న శ్రద్ద తనను సూపర్ స్టార్ చేసిన తెలుగు ప్రజలపై లేదని వర్మ విమర్శించారు.