సల్మాన్ భాయ్ స‌ర‌స‌న లోఫ‌ర్ బ్యూటీ

Thursday, May 17th, 2018, 03:13:00 AM IST

స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా అలీ అబ్బాస్ జాఫ‌ర్ `భ‌ర‌త్` అనే భారీ చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇంకా సెట్స్‌కెళ్ల‌క ముందే బాలీవుడ్‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. భాయ్ ఇటీవ‌లే `టైగ‌ర్ జిందా హై`తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. ఆ క్ర‌మంలోనే `రేస్ 3` లాంటి క్రేజీ మూవీలో న‌టిస్తూ వేడి పెంచాడు. రేస్ 3 ట్రైల‌ర్ ఈ మంగ‌ళ‌వారం రిలీజై, యూత్‌లోకి దూసుకెళ్లిపోయింది. `ప‌ద్మావ‌త్ 3`డి త‌ర‌హాలో.. బాలీవుడ్‌లో మ‌రో క్రేజీ 3డి మూవీగా రేస్ -3 రికార్డుల‌కెక్క‌నుంది. రేస్ 3లో ఇద్ద‌రు వేడెక్కించే క‌థానాయిక‌లు న‌టిస్తున్నారు.

ఇక‌పోతే `భ‌ర‌త్` చిత్రంలో భాయ్ స‌ర‌స‌న క‌థానాయిక‌లుగా ఎవ‌రు న‌టిస్తారు? అన్న ప్ర‌శ్న‌కు ఇదివ‌ర‌కూ ప్రియాంక చోప్రాను నాయిక‌గా ఎంపిక చేసుకున్నార‌ని ప్ర‌క‌టించారు. తాజాగా ఈ టీమ్‌కి మ‌రో యంగ్ బ్యూటీ యాడైంది. లోఫ‌ర్ ఫేం దిశా ప‌టానీ స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది. దిశా న‌టించిన `భాఘి 2` 100 కోట్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇప్పుడు ఏకంగా స‌ల్మాన్‌తోనే క్రేజీ ఆఫ‌ర్ అందుకుంది.

Comments