కొత్తగూడెం డిఎస్పీపై కేసు – పరిచయస్తులను కనిపెట్టడానికి ప్రారంభమైన వేట…

Wednesday, March 25th, 2020, 03:56:25 PM IST

గత కొంత కాలంగా ప్రపంచ దేశాలన్నింటినికూడా వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ భయంకరంగా విజృంభిస్తున్న కారణంగా మన దేశంలో కొన్ని కఠినమైన చర్యలతో కూడిన ప్రోటోకాల్ ని ఏర్పరిచారు. అయితే ఈ ప్రోటోకాల్ ని ఉల్లంఘించిన కారణంగా తెలంగాణ పోలీసు శాఖ కొత్తగూడెం డిఎస్‌పి అలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా డిఎస్పీ అలీని తన పదవి నుండి తప్పించి జిల్లా పోలీసు కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ మేరకు మంగళవారం నాడు ఉన్నతాధికారులు సంబంధిత ఉత్తర్వులను జారీ చేశారు. అయితే డిఎస్పీ కొడుకు వలన దాదాపుగా ఈ భయంకరమైన వైరస్ దాదాపుగా 25 మందికి సోకిందని సమాచారం.

కాగా లండన్ నుండి తిరిగి వచ్చిన డిఎస్పీ కొడుకు కి ఈ భయంకరమైన కరోనా వైరస్ సోకిందని సమాచారాన్ని అందుకున్న తరువాత, అతడు ఎక్కడికి వెళ్ళాడు, ఎవరెవరిని కలిసాడు, అనే దానిపై పోలీసులు చట్టపరమైన చర్యలను ప్రారంభించారని సమాచారం. ఇకపోతే ఈ DSP కొడుకు వలన, DSP కి, అతడి భార్యకి, తన సెక్యూరిటీ సిబ్బందికి, పనిమనుషులకు, వంట సిబ్బందికి ఈ వైరస్ సోకినట్లు సమాచారం. వారితో పాటే నలుగురు హోమ్ గార్డులు, డ్రైవర్, జుట్టు కత్తిరించిన సెలూన్ సిబ్బందికి, తన కార్యాలయ సిబ్బందికి, మరో ఇద్దరు సబార్డినేట్లకు ఈ కరోనా వైరస్ సోకిందని సమాచారం.

ఈ నేపథ్యంలో DSP కుటుంబం ఇటీవల ఒక వివాహానికి హాజరయ్యారు. అయితే ఆ వ్యక్తులతో సంబంధం ఉన్న వ్యక్తులను, పరిచయస్తులను అందరిని కూడా పరీక్షిస్తున్నారు. అంతేకాకుండా ఆ DSP ని ఇటీవల కలిసిన వారందరికి సంబందించిన వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే వీరందరిని కూడా ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.