దిశ నిందితుల ఎన్కౌంటర్ విషయం లో పోలిసుల వివరణ కోరనున్న సుప్రీం కోర్ట్

Tuesday, December 10th, 2019, 10:22:31 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు విషయం లో రేపు పోలీసుల్ని సుప్రీం కోర్ట్ లో విచారించనున్నారు. నిందితుల్ని ఎన్కౌంటర్ చేయడం పట్ల పూర్తీ వివరతో పాటుగా పోలీసులు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ కేసు విషయం లో సైబరాబాద్ సీఐ సజ్జనర్ సుప్రీం కోర్ట్ లో హాజరు కానున్నారు.

ఎన్ హెచ్ ఆర్ సి బృందం తెలంగాణాలో నిందితుల ఎన్కౌంటర్ ఫై సమాచారాన్ని సేకరించింది. అయితే ఇందులో కీలకంగా చెన్నకేశవులు భార్య అడిగిన ప్రశ్న పోలీసులకు సవాలుగా నిలిచే అవకాశం వుంది. తన భర్త చెన్నకేశవులే ఈ దారుణానికి పాల్పడ్డాడు అనడానికి సాక్ష్యాలు ఏవి అని తన భార్య ప్రశ్నించింది. అయితే ఈ సమాచారాన్ని అంతటిని సేకరించిన బృందం సుప్రీం కోర్టులో ఈ నివేదికని అందజేయనుంది.