సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలిపిన దిశ ఫాదర్..!

Friday, December 13th, 2019, 07:56:48 PM IST

వెటర్నరీ డాక్టర్ దిశ హత్య తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే దిశ హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపిన సంగతి తెలిసిందే. అయితే మహిళల రక్షణ కొరకు ఏపీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది.

అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో ఏపీ సర్కార్ దిశ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టింది. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే 21 రోజుల్లోనే తీర్పు వెలువడుతుందని వెంటనే ఉరిశిక్ష విధించేలా ఈ చట్టాన్ని రూపొందించారు. అయితే ఈ చట్టానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే ఏపీలో దిశ చట్టాన్ని ఆమోదించడంపై దిశ తండ్రి హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో దిశ చట్టం తీసుకురావడం సంతోషమని, ఈ చట్టాన్ని తీసుకొచ్చిన సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈ చట్టాన్ని ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని కోరుతున్నానని అన్నారు.