దిశ హత్యోదంతం : దిశ బాడీలో మద్యం గుర్తింపు…?

Saturday, December 14th, 2019, 11:16:10 AM IST

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వెటర్నరీ డాక్టర్ దిశ హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ హత్య కేసులో రోజుకొక కీలకమైన అంశం వెలుగులోకి వస్తుంది. కాగా తాజాగా ఈ కేసు విచారిస్తున్న పోలీసుల చేతికి మరొక కీలకమైన ఆధారం లభించింది. అయితే దిశపై అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసి ఆమె మృతదేహాన్నితగలబెట్టేశారు. కాగా దిశ బాడీలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. అయితే ఆ మద్యం ఆనవాళ్లు అనేవి దిశ కాలేయంలో నిపుణులు గుర్తించారు.

కాగా ఈ విషయం కోసం పోలీసులు ముందుగానే వెల్లడించినప్పటికీ కూడా మరొకసారి పరీక్ష జరిపారు. కాగా ఈకేసులో మరికొంత పురోగతి సాధించడానికి అధికారులు అందరు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు దిశ కి ఆ నలుగురు నిందితులు బలవంతముగా మద్యం తాగించారని పక్కా ఆధారాలతో సహా ఇప్పుడు ఆధారాలతో సహా ఫోరెన్సిక్ నివేదిక పొందుపరిచారు.