హృతిక్ సరసన ఛాన్స్ కొట్టేసిన పూరి హీరోయిన్ ?

Thursday, May 31st, 2018, 10:48:14 AM IST

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎన్నో ఆశలతో వచ్చిన దిశా పటాని దిశా మాత్రం మార్చుకోలేకపోయింది. లోఫర్ సినిమా భారీ పరాజయం పాలవడంతో ఈ అమ్మడికి కొత్త అవకాశాలు కరువయ్యాయి. దాంతో మళ్ళీ బాలీవుడ్ లోనే అవకాశాలు వెదుక్కుంటుంది. అక్కడ పెద్దగా ఛాన్సులు రాకపోవంతో ఈ అమ్మడు గ్లామర్ షోలతో ఫోటో షూట్స్ తో ఫోజిలిస్తూ అందరికి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే దిశా హాట్ ఫోటోలు ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. దాంతో ఈ అమ్మడు ఓ క్రేజీ ఆఫర్ పట్టేసింది. తాజాగా హృతిక్ రోషన్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. రోహిత్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. దాంతో పాటు ఈ అమ్మడు ఆలీ అబ్బాస్ జాఫర్ అనే దర్శకుడితో మరో సినిమాకు కమిట్ అయ్యింది.