బాబోయ్.. అంత భారాన్ని ఆ హీరోయిన్ మోయగలదా ?

Wednesday, September 27th, 2017, 12:45:34 PM IST


బాహుబలి సినిమా సంచలన విజయం తరువాత ఆ తరహా కథలతో సినిమా తీస్తే జనాలు తప్పకుండ చూస్తారన్న నమ్మకం వచ్చేసింది, దానికితోడు .. భారీ బడ్జెట్ పెట్టినా సరే సేఫ్ గా రిటర్న్స్ తెచ్చుకోవచ్చు అన్న ఆలోచనతో తమిళంలో ఏకంగా 200 కోట్లతో సంఘమిత్ర సినిమాను మొదలు పెట్టాడు దర్శకుడు సుందర్ సి ? గ్లామర్ భామ శృతి హాసన్ హీరోయిన్ గా మొదలు పెట్టిన ఆ సినిమానుండి ఆమె తప్పుకోవడంతో ఇప్పడు షూటింగ్ ఆగిపోయింది . మరి సంఘమిత్ర పాత్రలో ఎవరు నటిస్తారా అని అందరు హీరోయిన్స్ ను అడిగారు కాని ఎవరు వర్కవుట్ కాలేదు .. దాంతో ఫైనల్ గా బాలీవుడ్ భామ దిశా పటానిని దింపుతున్నారు? అసలే చూడడానికి బక్క పలచగా .. ఏమాత్రం సంఘమిత్ర పాత్రకు సెట్ కానీ దిశా కోసం ఈ దర్శక నిర్మాతలు 200 కోట్లతో ఆట మొదలు పెట్టబోతున్నారు ? అసలు ఇది వాళ్లకు సేఫ్ అవుతుందా ? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దిశా పటాని .. హీరోయిన్ గా చేసిన నాలుగు సినిమాలు కూడా పెద్దదిగా విజయాలు అందుకోలేదు .. అటు హీరోయిన్ గా ఆమెకు గుర్తింపు లేదు .. మరి అలాంటి హీరోయిన్ తో ఇంత రిస్క్ అవసరమా అంటూ కోలీవుడ్ లో జోరుగా వార్తలు వస్తున్నాయి . మరి ఈ విషయం పై దర్శక నిర్మాతలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి ?

  •  
  •  
  •  
  •  

Comments