తెరాస లో అసంతృప్తి – విడిపోక తప్పేలా లేదుగా…?

Tuesday, September 10th, 2019, 01:50:57 AM IST

ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తన పూర్తిస్థాయి మంత్రి వర్గ విస్తరణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. కాగా కాగా ఈ విషయంలో ఇప్పటికి కూడా తీవ్రమైనటువంటి విమర్శలను ఎదుర్కొంటున్నారు కెసిఆర్. కాగా ఈమేరకు మాజీ హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తనకి అన్యాయం చేశారని, మంత్రి పదవి ఇస్తానని ఎన్నికలకు ముందు మాటిచ్చారని, కానీ కనీసం ఇపుడు అడుగుతుంటే మొహం చాటేస్తున్నారని మీడియా ముఖంగా నాయిని వాఖ్యానించిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఆతరువాత తెరాస నేత తాటికొండ రాజ్య కూడా ఇలాగె కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. అయితే తెలంగాణాలో దాదాపుగా 15 శాతానికి పైగా ఉన్నటువంటి మాదిక కులానికి చెందిన ఒక్కరు కూడా మంత్రి పదవి హోదాలో లేరని, మాదిగలంటే ఎందుకంత వివక్ష అని వాపోయారు రాజయ్య…

అంతేకాకుండా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా సేమ్ ఇలాగె వ్యవహరించారని, తన పదవి తో పాటు తన కూతురి రాజకీయ భవిష్యత్తు కోసం చాలా ఆలోచనలు చేస్తున్నారని సమాచారం. గతంలో ఉన్నంత ప్రాధాన్యత, ఇపుడు ఎవరు కూడా ఇవ్వడం లేదని అసలు వారిని పట్టించుకునే నాధుడే కరువయ్యారని వాపోతున్నారు. ఈమేరకు కడియం డ్రైహరి కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఆయనతో పాటె తాటికొండ రాజయ్య కూడా ఉన్నారు. ఒకవేళ వీరే గనక పార్టీ మారితే మాత్రం వీరితో పాటే చాలా మంది నేతలు కూడా పార్టీ వదిలేస్తారని వార్తలు వస్తున్నాయి. దానికి తోడు ఎవరికీ వారు గులాబీ జండా కి ఓనర్లమని చెప్పుకుంటున్న వీరు గులాబీ జెండా ని చీల్చే పనిలో ఉన్నారని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ముఖ్యమంత్రి స్తానం కూడా కదులుతుందని మాట్లాడుకుంటున్నారు కొందరు.