నేటి నుంచి పేదలకు ఉచిత బియ్యం పంపిణీ – మంత్రి కొడాలి

Saturday, May 1st, 2021, 07:59:07 AM IST

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతున్న నేపధ్యంలో పేద ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలందరికి ప్రతి ఒక్కరికి 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చినట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 10 కిలోలు సార్టెక్స్‌ స్వర్ణరకం మధ్యస్త సన్నబియ్యం పంపిణీ చేస్తామని కొడాలి నాని అన్నారు.

అయితే నేటి నుంచే ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అయితే మే, జూన్‌ నెలల్లో ఈ ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతుందని కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.47 కోట్లు బియ్యం కార్డులున్నాయని, అందరికి ఉచిత బియ్యం అందిస్తామని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 800 కోట్లు వెచ్చించిందని మంత్రి కొడాలి నాని స్పస్టం చేశారు.