మహిళలపై హత్యాచారాలకు మద్యపానం కూడా కారణమే: డీకే అరుణ

Wednesday, December 11th, 2019, 02:27:42 AM IST

తెలంగాణ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ మద్యం కారణంగానే మనుషులు మృగాలుగా మారుతున్నారన్నారని మండిపడ్డారు. మద్యపానం కారణంగానే ఎక్కువ శాతం నిందితులు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని అన్నారు.

అయితే మద్యం అమ్మకాలు నిషేధించాలని అందుకోసం రెండురోజుల దీక్ష చేపడతానన్నారు. ఈ దీక్షను విజయవంతం చేసేందుకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళలు మద్దతు తెలపాలని కోరారు. అయితే రాష్ట్రంలో దిశ ఘటనతోపాటు మరో రెండు ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. ఈ కేసుల్లో నిందితులపై చర్యలు తీసుకోడానికి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.