బతుకమ్మకు సోనియాను ఆహ్వానించాలి – అరుణ

Sunday, September 14th, 2014, 04:39:24 PM IST


తెలంగాణ పండగ బతుకమ్మను ప్రభుత్వం వైభవంగా జరపాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డికె అరుణ అన్నారు.త్వరలో జగవబోయే ఈ పండుగ సమీక్ష సమావేశానికి తెలంగాణ మహిళా నేతతలను పిలవాలని అన్నారు. బతుకమ్మ పండుగ కోసం భారీ ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని డికె అరుణ ప్రభుత్వానికి సూచించారు. పండగ దగ్గరకి వస్తున్నదని, తెలంగాణలో ఉండే చెరువులను ఈ పండగ కోసం సిద్దం చేయాలని, అలాగే, చెరువుల వద్ద సౌకర్యాలు కల్పించాలని అరుణ డిమాండ్ చేశారు.