కరోనా తెలంగాణలో కమ్యూనిటీ లోకి వెళ్ళింది… వచ్చే నాలుగైదు వారాల్లో పరిస్తితి సంక్లిష్టం!

Friday, July 24th, 2020, 02:04:14 AM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల కంటే ఈ కరోనా కమ్యూనిటీ లోకి వెళ్ళింది అనే వార్త ప్రజలను మరింత ఎక్కువగా భయాందోళన లకు గురి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం లో ఎక్కువగా హైదరాబాద్ తర్వాత ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉంది అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డీఎం ఈ రమేష్ రెడ్డి అన్నారు. అయితే రాబోయే నాలుగు అయిదు వారాలు పరిస్తితి ఇంకా సంక్లిష్టం గా మారే అవకాశం ఉందని తెలిపారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులు ఉన్నాయి అని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. అంతేకాక ఇపుడు ఉన్న పరిస్తితి ను కమ్యూనిటీ అనలేం అని, కానీ ద్వితీయ శ్రేణి నగరాల్లో కేసులు పెరుగుతున్నాయి అని, అక్కడ కరోనా చికిత్స త్వరగా చేస్తే పరిస్తితి మేరుగవుతుంది అని అన్నారు. అయితే ఎక్కువగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేస్తున్నాం అని, అందుకు ప్రభుత్వం సహకరిస్తూ అని, కాకపోతే అన్ని జిల్లా కేంద్రాల్లో చికిత్స అందజేస్తున్నారు అని, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప హైదరాబాద్ కి రావాలి అని పేర్కొన్నారు.