మరో వైరస్ విషయంలో భయపడక్కర్లేదా?

Wednesday, March 25th, 2020, 09:44:18 AM IST

తాజాగా కరోనా కారణంగా మన దేశం మొత్తం మొన్న జరిగిన జనతా కర్ఫ్యూను మించే విధంగా మరో మూడు వారాల పాటు యావత్తు దేశం అంతా లాక్ డౌన్ పాటించాలని దేశ ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దీనికి కారణం తెలుసు. కానీ ఇప్పుడు ఈ కరోనా బాధే తాళలేకపోతున్నాం అంటే చైనా నుంచే మరో వైరస్ వచ్చిందని మరో వార్త కలకలం రేపింది.

దీనికి హంట వైరస్ అనే పేరు కూడా పెట్టారు. అయితే దీని కోసం ఇప్పుడు మన దేశపు మీదకి సహా తెలుగు రాష్ట్రాల మీడియాల వారు కూడా బ్రేకింగ్ న్యూస్ లు వేస్తున్నారు. అయితే దీని విషయంలో మాత్రం ఎక్కడా భయపడక్కర్లేదు అని తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఇప్పటికే ఉన్నదే దానికి విరుగుడు కూడా ఉందని దీని మూలాన ఎవరికైనా సోకినా తగ్గించొచ్చు అని తెలుస్తుంది.