శ్రీ దేవి బయో పిక్ ఫిక్స్ …టైటిల్ ఏంటో తెలుసా..?

Monday, April 30th, 2018, 10:46:55 AM IST

ఇటీవలే దివంగతురాలైన అతిలోక సుందరి, అందాలనటి శ్రీదేవి జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు ఆమె భర్త బోనీకపూర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.. శ్రీదేవి నటప్రస్థానం, ప్రేమాయణం, పెళ్లి, గృహిణిగా, తల్లిగా తన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించిన తీరుతో ఆమె జీవితంలోని పలు కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం కోసం శ్రీ, శ్రీదేవి, శ్రీ మామ్ అనే టైటిల్స్‌ను బోనీకపూర్ రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. మామ్ చిత్రంలో అసమాన నటనకు గాను ఉత్తమనటిగా మరణానంతరం ఇటీవలే జాతీయ పురస్కారానికి ఎంపికైంది శ్రీదేవి. ఇవన్నీ బోనీకపూర్ వంశంలో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా శ్రీ దేవి బయోపిక్ తీసి తీరాలని కచ్చిత నిర్ణయం తీసుకున్నాడు. ఇదిలా ఉంటే శ్రీ దేవి మరణానంతరం బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు అయిన అర్జున్ కపూర్ ఆగిపోయిన సినిమా కూడా తిరిగి మొదలు పెట్టి అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments