బిగ్ అప్డేట్ : ఈసారి ఆర్జీవీ టార్గెట్ ఎవరో తెలుసా – తెలిస్తే షాకే…?

Sunday, November 17th, 2019, 02:20:42 AM IST

ప్రస్తుత కాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయాల ఆధారంగా జరిగిన సంఘటనలను తెరకెక్కిస్తున్నారు ప్రముఖ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కాగా ఆర్జీవీ తాజాగా తెరకెక్కించిన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. అందులో ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అన్నింటిని కూడా కళ్ళకు కట్టినట్లు చూపిస్తానని ఇదివరకే ప్రకటించారు. దానికి తోడు ఇప్పటికే విడుదలైన ఆ చిత్ర ట్రైలర్ కూడా అన్ని అంచనాలను అధిగమిస్తూ, కొత్త వివాదాలకు దారి తీస్తుంది కూడా. అయితే ఆర్జీవీ ఆ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రానికి సీక్వెల్ తీయడానికి సిద్దమయ్యాడు.

దానికి కారణం లేకపోలేదు. ఇటీవలే టీడీపీ ని వదిలిన వల్లభనేని వంశీ ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారుతున్నాడు. ఎందుకంటే ఇన్నిరోజులు టీడీపీ లో కీలకంగా వెలిగిన ఆయన, ఒక్కసారిగా పార్టీ నుండి బయటకు వచ్చాక అందరిని కూడా దారుణమైన విమర్శలతో రఫ్ఫాడించేస్తున్నాడు. అయితే వంశీ మాటలకు ముగ్దుడైన మన ఆర్జీవీ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే చిత్రానికి కొనసాగంపు తీసి, దాంట్లో వంశీ ని టార్గెట్ చేయనున్నాడని సమాచారం. అంతేకాకుండా ఆ చిత్రానికి టైటిల్ కూడా డిసైడ్ చేశారు ఆర్జీవీ. “రెడ్డి రాజ్యానికి కమ్మ ఫాన్స్” అంటూ చిత్రాన్ని ప్రారంభించనున్నారు.