డాక్టర్ సుధాకర్ తల్లి వారిపై సంచలన కామెంట్స్.!

Saturday, May 30th, 2020, 08:02:00 AM IST

ఏపీలో కరోనా నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ తనకి సరైన సదుపాయాలు లేవని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినందుకు ఇపుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అందరికీ తెలిసిందే. అలాగే మళ్ళీ ఇటీవలే రోడ్డెక్కి నానా రచ్చ చెయ్యగా అతన్ని ఇప్పుడు మానసిక వైద్యశాలలో బలవంతంగా చేర్పించారు.

అయితే ఆయనకు నిజంగానే మానసికంగా ఏమన్నా సమస్య ఉందో లేదో అందులో ఎంత వరకు నిజముందో కానీ సుధాకర్ తల్లి కావేరి భాయ్ మాత్రం తన బిడ్డ ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులను చూసి ఓర్వలేకపోతున్నారు. ఇదే సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

తన కొడుకు ఏ పార్టీకు కూడా చెందిన వాడు కాదని తాను ఎదుర్కొన్న ఇబ్బందిని చెప్తే అతనిపై ఈ ప్రభుత్వం ఇంతలా కక్ష సాధింపు చెయ్యాలా అని వ్యాఖ్యానించారు. అలాగే తన కొడుకుని ఇబ్బంది పెట్టిన ప్రతీ ఒక్కరు జగన్ దృష్టిలో మెప్పు పొందడానికి మాత్రమే పని చేస్తున్నారని తన కొడుకుని ఇలా చూడడం కానీ ఇలా మాట్లాడటం కానీ ఇదే మొదటిసారి అని అన్నారు.

అసలు మానసికంగా ఎలాంటి ఇబ్బంది లేని నా కొడుకుని సమాజంలో పిచ్చివాడిగా ముద్ర వేసిన ప్రతీ ఒక్కరికి ఒక తల్లిగా తన ఉసురు తగులుతుంది అని నా కన్నీళ్లు వారికి తప్పకుండా తగులుతాయని సుధాకర్ తల్లి సంచలన కామెంట్స్ చేసారు.