మేజిస్ట్రేట్ ముందు విస్తుపోయే నిజాలు చెప్పిన డాక్టర్ సుధాకర్..!

Sunday, May 24th, 2020, 02:34:39 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలో ప్రభుత్వ వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు ఇప్పటికే సీబీఐ చేతుల్లోకి వెళ్ళగా నేడు ఏపీ హైకోర్ట్‌లో మేజిస్ట్రేట్‌ ముందు డాక్టర్‌ సుధాకర్‌ వాంగ్మూలం ఇచ్చారు.

అయితే ఎన్‌-95 మాస్కుల కోసం ముందు నర్సీపట్నం ఎమ్మెల్యే వద్దకు వెళ్ళానని ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో అయ్యన్నవద్దకు వెళ్లానని తెలిపాడు. మాస్కుల గురించి అడిగితే అధికారులంతా తనను దూషించారని ఆ సమ్యంలో అక్కడే ఉన్న మీడియావాళ్లు అడిగితే జరిగిన విషయం చెప్పానని అన్నారు.

అలా మీడియాతో చెప్పినందుకు ఏప్రిల్‌ 8వ తేదిన నన్ను సస్పెండ్‌ చేశారని అన్నారు. అది జరిగిన రెండు రోజులకే కొందరు స్కోడా కారులో వచ్చి మా అబ్బాయి బైక్‌ తీసుకెళ్లారని, విషయం తెలుసుకునేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళితే ఓ మహిళా కానిస్టేబుల్‌ నా చేతులు పట్టుకుని వదలండి అంటూ కేకలేసిందని అప్పుడు పోలీసుంతా కలిసి నన్ను కొట్టారని అన్నారు. అయితే ఇల్లా నన్ను బాగా వేదిస్తూ ఓ తాగుబోతులా, పిచ్చోడిలా చిత్రీకరించేందుకు యత్నించారని ఆ రోజు పీఎస్‌ నుంచి కేజీహెచ్‌కు అక్కడి నుంచి మెంటల్‌ ఆస్పత్రికి తరలించారని వాంగ్మూలం ఇచ్చారు.