నాపై ప్రయోగిస్తున్న మందులు నన్ను సైకో గా మార్చే ప్రమాదం ఉంది – డాక్టర్ సుధాకర్

Thursday, May 28th, 2020, 09:28:40 AM IST


వైజాగ్ లో జరిగిన డాక్టర్ సుధాకర్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్న సుధాకర్ ఆసుపత్రి పర్యవేక్షకులకు ఒక లేఖ రాశారు. ప్రభుత్వ ఆసుపత్రి లో తన పై ప్రయోగిస్తున్న మందులు తనని సైకో లా మార్చే ప్రమాదం ఉంది అని తెలిపారు. తనకు ఇస్తున్న నాలుగు రకాల మాత్రలు, ఇంజెక్షన్ పెదాలు తడి ఆరిపోవడం, యూరిన్ ఆగిపోవడం,కళ్ళు మసకలుగా మారడం ఇంకా తల తిరుగుతున్న లక్షణాలు ఉన్నాయి అని డాక్టర్ సుధాకర్ లేఖలో పేర్కొన్నారు.

అయితే తన పై ప్రయోగిస్తున్న మందుల ద్వారా పెదవుల పై పుండ్లు వస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాది శ్వాస నాళ సంబధిత నిమోనియా కి దారి తీయవచ్చు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.అంతేకాక డాక్టర్ రామిరెడ్డి ఇస్తున్న ట్రీట్మెంట్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మానసిక రుగ్మతలకు ఉపయోగించే డ్రగ్స్ ను తనకు ఇస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే సుధాకర్ రాసిన లేఖ పై తన తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

నాలుగు పేజీల లేఖ రాశాడు, అంటే అతని మానసిక పరిస్తితి బావుంటే ఎలా రాయగలడ అంటూ ప్రశ్నించింది.కేస్ దర్యాప్తు ను సిబిఐ కి అప్పగిస్తే ప్రభుత్వం ఎందుకు సుప్రీం కోర్టు కి వెళ్తుంది అని వ్యాఖ్యానించారు.తన బిడ్డకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని తల్లి కావేరి భాయ్ అన్నారు.సుధాకర్ ను పిచ్చి వాడినీ చేయడానికే ఇలా వైద్యం అందిస్తున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు.