మానవత్వం పరిమళించే..

Friday, September 12th, 2014, 12:57:13 PM IST


జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఇంతభారీగా వరదలు రావడం ఇదే మొదటిసారి.ఇక శ్రీనగర్ సిటీలో అయితే మరీ అద్వాన్నంగా ఉన్నది. ఈ నగరానికి మిగతా ప్రాంతాలతో సంబందాలు తెలిగిపోయాయి.

వరద కొంచెం తగ్గు ముఖం పట్టడంతో.. నగరంలో ఉన్న ఓ చిన్న 20 పడకల ఆసుపత్రికి రోగుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. కాన్పుల కోసం, డయాలసిస్ కోసం, జ్వరంతో వచ్చేవారు.. ఇలా ఒకరేమిటి అనేక మంది ప్రతిరోజూ తండోపతండాలుగా ఈ చిన్న ఆసుపత్రికి వస్తున్నారు. ఇప్పుడు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ నగరంలో పనిచేస్తున్న ఒకేఒక ఆసుపత్రి ఇదే.. నగరంలోని మిగతా హాస్పిటల్స్ అన్ని.. వసతులు లేక.. మందులు.. వైద్యులు లేక ఇబ్బందులు పడుతున్నాయి.. దీంతో అక్కడికి వెళ్ళిన వారిని..ఈ చిన్న హాస్పిటల్ కు పంపుతున్నారు.

ఈ చిన్న హాస్పిటల్ లో మూడొంతులు సేవలు ఉచితంగానే చేస్తున్నారు.. వారికి అందవలసిన సాయం కేవలం మందులు మాత్రమే.. అయితే.. శస్త్రచికిత్సకోసం అవసరమైన పరికరాలు, మందులు ఢిల్లీనుంచి శ్రీనగర్ కు వస్తున్నప్పటికీ.. వాటిని విమానాశ్రయం నుంచి.. హాస్పిటల్ కు రప్పించేందుకు మార్గాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆ చిన్న హాస్పిటల్ లోని వైద్యులే.. రోగులకు చికిత్స్ అందిస్తూనే.. మరోవైపు.. హాస్పిటల్ ను శుభ్రపరిచే కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. రోజుకు రెండు లేక మూడు సర్జరీలు జరిగే ఈ చిన్న హాస్పిటల్ లో ఈ రోజు రోజుకు 20 నుంచి 30 ఆపరేషన్లు జరుగుతున్నాయి.

ఈ చిన్న హాస్పిటల్ యజమాని పేరు.. డాక్టర్ ఆసిఫ్ ఖాండే. విచిత్రం ఏమిటంటే..వరదలలో ఆయన కుటుంబ సభ్యులు కూడా తప్పిపోయారు. నిన్ననే వారంతా.. రాంబాగ్ ప్రభుత్వ పునరావాస కేంద్రంలో క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందింది. కాని, డాక్టర్ ఖాండే మాత్రం.. తన పనిని మాత్రం వదలలేదు.. ఇప్పటికీ వచ్చిన రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా.. చికిత్స అందిస్తూనేఉన్నారు.