షూటింగ్ మధ్యలో నటి ముఖాన్ని కరిచిన కుక్క

Thursday, April 19th, 2018, 12:32:43 PM IST

సాధారణంగా నటులు రిస్క్ లు తీస్కోని ఫైట్ లు చేయడం, జంప్ లు చేయడం మనం చూస్తూనే ఉంటాం. నిజానికి కొన్ని కొన్ని సీన్లలో వాళ్ళు అంట కష్టపడలేదు అనిపిస్తుంది. కానీ అలాంటి చోట్లలోనే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సెల‌బ్రిటీగా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందడం అంత ఈజీ కాదు కదా మరి. అయితే షూటింగ్‌లో భాగంగా సెల‌బ్రిటీస్ అలాంటి రిస్క్‌లు చేసి అభిమానులని అల‌రిస్తే కాని వారికి సెల‌బ్రిటీ స్టేట‌స్ ద‌క్క‌దు. తాజాగా బాలీవుడ్ బుల్లితెర న‌టి రీనా అగ‌ర్వాల్ కుక్క వ‌ల‌న గాయ‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుంది.

క్యాహాల్‌ మిస్టర్‌ పంచల్‌ షో షూటింగ్‌లో భాగంగా ఓ కుక్కతో సీన్‌ను చిత్రీకరిస్తుండగా.. అది కాస్త రీనా ముఖంపై కరిచింది. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన బృందం హుటాహుటిని కోకిల ఆస్ప‌త్రికి తీసుకెళ్ళారు. ముఖంపై ప‌లు కుట్లు వేసిన వైద్యులు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించార‌ట‌. సీరియ‌ల్స్‌లోనే కాక అమీర్‌ ఖాన్‌ తలాష్‌.. బహెన్‌ హోగీ తేరీ తదితర చిత్రాల్లో న‌టించిన రీనా బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి బాగానే సుప‌రిచితం. ఇక కుక్క గాట్లు ముఖం మీద గాయాల కుట్లు ముఖంపై పోతాయో తన సినిమా లైఫ్ ఏమయిపోతుందో అని నటి మనస్తాపానికి గురయినట్లు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments