ఏడొందల కిలోమీటర్ లు అతనితో కలిసి వచ్చిన కుక్క .. ఇదొక అద్భుతం

Saturday, December 31st, 2016, 11:57:17 AM IST

dog
మనిషి నైజానికి సరైన మార్గదర్శి కుక్కే అనీ నమ్మకమైన జంతువు కూడా అదే అని మళ్ళీ ప్రూవ్ అయ్యింది. చిన్న తనం నుంచే కుక్కని తెచ్చుకుంటే అవి పెద్దయ్యాక కూడా మనవెంటే ఉంటాయి కానీ పెద్ద కుక్కలు అంత త్వరగా మనతో కలవవు. అలాంటిది తెలీని ఒక కుక్క తో కలిసి ఒక అయ్యప్ప భక్తుడు ఏడు వందల కిలోమీటర్ ల దూరం నడిచాడు. అయ్యప్ప మాల వేసుకుని కేరళకు బయలుదేరిన కేరళలోని కోలికోడ్ వాసి నవీన్ (38)కు అదే అనుభవం ఎదురైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, డిసెంబర్ 8న కోలికోడ్ నుంచి నవీన్ 700 కిలోమీటర్ల నడకయాత్ర ద్వారా శబరిమలకు బయలుదేరాడు. ప్రయాణం 20 కిలోమీటర్లు సాగిన తరువాత ఓ శునకం తన వెంట వస్తోందని గమనించాడు. ఆపై అది తనను విడవడం లేదని గుర్తించాడు. మరో 80 కిలోమీటర్లు వెళ్లే వరకు ఆ శునకం అతని ప్రయాణంలో స్నేహితుడిగా మారింది. ఆపై 600 కిలోమీటర్ల దూరం అతనితోనే కలిసి ప్రయాణించింది. శునకం మెడలో అయ్యప్ప మాల వేసిన నవీన్, దానికి ఓ నల్లని బెల్టు కట్టి నడిపించాడు. దానికి ‘మలు’ అని పేరు పెట్టాడు. నవీన్ అలసిన వేళ అతనికి కాపలాగా మలు ఉండేది. ఓ సంరక్షకుడిలా కాపాడింది. తన ప్రయాణపు మజిలే పంబ చేరుకోగానే జనం లో వీరిద్దరూ విడిపోయారు. మాలు కోసం నవీన్ చాలా ప్రయత్నాలు చేసినా దొరకలేదు ఆ కుక్క. అన్ని రోజులూ నవీన్ తో నడిచి వచ్చిన శునకాన్ని గుర్తించిన కొందరు భక్తులు అది ఉన్న ప్రదేశం గురించిన సమాచారాన్ని నవీన్ కు అందించారు. చివరకు ఒకటిన్నర రోజుల తరువాత దాన్ని చేరుకోగా, అతన్ని చూసిన మలు, ఎగిరి దుమికి మరీ తన ప్రేమను చాటుకుంది. ఇక దాన్ని విడిచి పెట్టడం ఇష్టం లేని నవీన్, రూ. 460 పెట్టి టికెట్ కొని మరీ బస్సులో దాన్ని తన స్వస్థలానికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం అతని తోనే ఉంటోందీ శునకరాజం.

  •  
  •  
  •  
  •  

Comments