బిగ్ న్యూస్ : భారత్ లో కరోనా టెస్టుల విషయం లో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Sunday, June 7th, 2020, 12:49:58 PM IST

భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రోజుకి వందల సంఖ్యలో బాధితులు మరణిస్తున్నారు. వేల సంఖ్యలో కరోనా వైరస్ భారిన పడుతున్నారు. అయితే ఇప్పటికే భారత్ కరోనా వైరస్ కేసుల విషయంలో ప్రపంచం లో అయిదవ స్థానం లో ఉంది. అయితే తాజాగా ఈ కేసుల విషయంలో కరోనా టెస్టుల విషయం లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత్, చైనా లలో కరోనా పరీక్షల సంఖ్య ను పెంచితే అమెరికా కంటే ఎక్కువగా కేసులు నమోదు అవుతాయి అని వ్యాఖ్యానించారు.అయితే ప్రస్తుతం భారత్ లో టెస్టుల సంఖ్య చాలా తక్కువ అని అన్నారు. అమెరికా లో ఇప్పటి వరకూ రెండు కోట్ల కరోనా పరీక్షలు నిర్వహిస్తే 19 లక్షలు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి అని అన్నారు. అయితే భారత్ లో ఇప్పటి వరకూ 40 లక్షల కరోనా టెస్టులే చేశారు అని ఆరోపించారు. అయితే కరోనా నిర్దారణ పరీక్షలు ఎంత పెరిగితే అంత పాజిటివ్ కేసులు నమోదు అవుతాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా టెస్టులకు స్వాబ్ ల ఉత్పత్తి లో అమెరికా టాప్ లో ఉంది అని, అది దేశానికి గర్వ కారణం అని అన్నారు.