అకీరాను పవన్ తో పోల్చొద్దు..రేణు దేశాయ్

Monday, April 9th, 2018, 10:10:30 AM IST

పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల ముద్దుల త‌న‌యుడు అకీరా నందన్ నిన్న‌టితో 14వ‌ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. 2004 ఏప్రిల్ 8న జన్మించిన అకీరా ప్రస్తుతం పూణేలో విద్యాబుద్దులు నేర్చుకుంటున్నాడు. అయితే అకీరా పుట్టినప్పటి నుండి పవన్ కళ్యాన్ అభిమానులు అకీరా ని జూనియర్ పవర్ స్టార్ అంటూ పిలుస్తూ వచ్చేవారు. అయితే అలాంటి గుర్తింపు అకీరాకి వద్దని, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్టు రేణూ గ‌త ఏడాది తన ట్విట్టర్ లో పేర్కొంది. అయితే ఈ ఏడాది కూడా అకీరాకి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌ల వెల్లువ కుర‌వ‌డంతో రేణూదేశాయ్ చాలా భావోద్వేగంతో త‌న ఫేస్ బుక్ పేజ్‌లో పోస్ట్ పెట్టింది. నా కుమారుడిపై మీరు చూపిస్తున్న ప్రేమ అనిర్వ‌చ‌నం. అకీరాకి 14 ఏళ్ళు వ‌చ్చాయి క‌నుక టెక్నిక‌ల్‌గా చూస్తే బేబి బోయ్ ఏమి కాదు కాని, జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిగా త‌న‌ని ఎప్పుడు ఓ చిన్నారిగా చూస్తాను. త‌ల్లి, తండ్రి త‌ర‌పున గొప్ప వ్య‌క్తులున్న కుటుంబంలో అకీరా జ‌న్మించాడు. మీరంద‌రు అందించిన బ‌ర్త్‌డే విషెస్‌కి అకీరా త‌ల్లిగా చాలా భావోద్వేగం చెందాను. మీ అందరికీ నా లిటిల్ బర్త్ డే బోయ్ తరపున థ్యాంక్యూ’ అని ఫేస్ బుక్ పేజ్‌లో త‌న కుమారుడితో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ కామెంట్ పెట్టింది.

అకీరాకి మెగా హీరోలు రామ్ చ‌ర‌ణ్ తేజ్‌, వ‌రుణ్ తేజ‌, సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపారు. గతంలో పవన్ కళ్యాణ్ ముందు జూనియర్ పవర్ స్టార్ అకీరా అనే ప్రశ్న ఉంచగా, దీనిని ఆయన సున్నితంగా కొట్టిపారేశాడు. అకీరా ఏ ఫీల్డ్ ఎంచుకున్నా అది మాకు సంతోషమే అని పవన్ అన్నాడు. అయితే రామ్ చ‌ర‌ణ్ త‌న త‌మ్ముడికి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ షేర్ చేసిన ఫోటో రీసెంట్ పిక్‌గా తెలుస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. చెర్రీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిరు ఇంటికి వెళ్ళాడు. అన్నా వ‌దిన‌ల‌తో క‌లిసి ఫోటోకి ఫోజులిచ్చాడు. ఆ ఫోటోలు ఫుల్ వైర‌ల్ అయ్యాయి. కాని ఆ రోజు ప‌వ‌న్ త‌న పిల్ల‌లు ఆరాధ్య‌, అకీరాని కూడా వెంట‌పెట్టుకొని వెళ్ళిన‌ట్టు ఈ ఫోటోని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది.

  •  
  •  
  •  
  •  

Comments